ఆ విషయంలో రమ్యకృష్ణకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. రమ్యకృష్ణ రియాక్షన్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటనలో తన తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. చైల్డ్ ఆర్టిస్టుగా తన నటన జీవితం మొదలుపెట్టిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు . ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా హీరోగా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరోగా గుర్తింపు పొందాడు.

స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా ద్వారా ఎన్టీఆర్ మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యింది. అయితే సింహాద్రి షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేసిన ఒక పని వల్ల రమ్యకృష్ణ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడట. సింహాద్రి సినిమాలో ఒక పాటలో ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాట షూటింగ్ చేసే సమయంలో ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడట. షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ తరచూ రమ్య కృష్ణను తాకాల్సి వచ్చింది. వయసులోనూ నటనలోనూ తనకన్నా ఎంతో అనుభవం ఉన్న గొప్ప నటిని ఇలా తాకడం ఏంటి అని ఎన్టీఆర్ తనలో తానే బాధ పడ్డాడు.

అందువల్ల ఎన్టీఆర్ స్వయంగా రమ్యకృష్ణ వద్దకు వెళ్లి ‘ నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుంటే నన్ను క్షమించండి’ అంటూ ఎన్టీఆర్ రమ్యకృష్ణకి క్షమాపణలు చెప్పాడట. అయితే ఎన్టీఆర్ మాటలకు రమ్యకృష్ణ షాక్ అయ్యి నవ్వుతూ.. అలాంటిదేమీ లేదు.. నువ్వు ఏదేదో ఊహించుకోకు. నువ్వు డాన్స్ బాగా వెయ్యడం వల్ల.. నేను కూడా రెట్టింపు ఉత్సాహంతో చేశానని చెప్పారట. ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో ఇలా టచ్ చేయడం లాంటివి కామన్ గా ఉంటాయి. అయితే అది జస్ట్ నటన మాత్రమే కదా అంటూ చెప్పిందట. అయితే తారక్ వచ్చి ఇలా క్షమాపణలు అడగడంతో ఆమె ఎన్టీఆర్ సెన్సిటివిటి, మహిళల పట్ల గౌరవం చూసి సంబరపడ్డారట.