దారుణ పరిస్థితిలో రకుల్ ప్రీత్.. డైలీ పేమెంట్ స్థాయికి పడిపోయిన అమ్మడు..!

సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ ఆ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రకుల్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీ లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయిపోయింది.

రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో బిజీ అయిపోయిన తర్వాత తెలుగులో సినిమాలను తగ్గించింది. తెలుగులో చివరగా ఈమె నటించిన సినిమా చెక్. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ లాయర్ పాత్రలో నటించింది. ఇక బాలీవుడ్లో వరుస సినిమాలతో రకుల్
బిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్ లో రకుల్ నటించిన
రన్ వే 34 సినిమా హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ లో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్ సినిమా ‌లో నటిస్తు్న్నారు. ఇక వీటితో పాటు తమిళ్ భాషలో ఒక సినిమా, హిందీలో మరొక సినిమాలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ గురించి ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అధిక రెమ్యూనరేషన్ అందుకున్న రకుల్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో కొంత సడలింపు ఇచ్చినట్టు సమాచారం. ఇదివరకు ఒక సినిమా కోసం పెద్దమొత్తంలో ఒకేసారి రెమ్యూనరేషన్ అందుకున్న రకుల్ ఇప్పుడు ఒక్కసారిగా కాకుండా.. రోజురోజుకు.. అంటే డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చారట. ఈ క్రమంలో ఒక రోజులు 3 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంకా పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ఈ విషయం గురించి ఒక క్లారిటీ రావాలంటే రకుల్ ప్రీత్ సింగ్ స్పందించాల్సి ఉంటుంది.