ప్రతి సినిమాలోని ఆ హీరోయిన్స్ కావాలంటున్న ప్రభాస్.. అసలు కాంప్రమైజ్ కాలేదుగా?

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే నార్త్ సౌత్ ఇండస్ట్రీలలో మంచి మార్కెట్ ఉన్న సెలెబ్రిటీలను ఎంపిక చేసుకొని సినిమా చేస్తే తప్పకుండా సినిమా వర్కౌట్ అవుతుందని భావించి దర్శక నిర్మాతలు అత్యధిక రెమ్యూనరేషన్ చెల్లించి స్టార్ సెలబ్రిటీలను తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాలోని ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఉండాలని ఆరాటపడుతున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ అధికంగా ఉన్న హీరోయిన్స్ అయితే సినిమా వర్కౌట్ అవుతుందని ప్రభాస్ భావిస్తున్నారట అందుకే బాహుబలి తర్వాత సాహో సినిమాతో పాటు ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్, ప్రాజెక్టుకే వంటి సినిమాలలో బాలీవుడ్ భామలను రంగంలోకి దింపారు. ఇదిలా ఉండగా తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన కరీనాకపూర్ నటిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ కరీనాకపూర్ కాకపోయినా ఈ సినిమాలో తప్పనిసరిగా ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తన సినిమాలో తప్పకుండా బాలీవుడ్ హీరోయిన్ ఉండాలని భావిస్తుండడంతో దర్శక నిర్మాతలు సైతం బాలీవుడ్ హీరోయిన్లకు మొదట అవకాశం కల్పిస్తున్నారు. ప్రభాస్ కి సౌత్ లో ఎంతో మార్కెట్ ఉన్న సంగతి మనకు తెలిసిందే అందుకే హీరోయిన్లను నార్త్ నుంచి దింపితే సినిమా నార్త్ లో కూడా ఆదరణ పొందుతుందని భావించడంతో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ను తీసుకోవడానికి ప్రభాస్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.