మీకు తెలుసా? ఎక్కడైనా ఏదైనా అనౌన్స్ మెంట్ చేసేటప్పుడు లేడిస్ అండ్ జెంటిన్ మెన్ అని పిలుస్తుంటారు కదా. మీటింగ్ లలో కానీ.. ఇంకా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, ఇతర ఈవెంట్లలో ముందుగా లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అన్నాకనే మిగితా విషయాలు చెబుతారు. అది స్టార్టింగ్ అన్నమాట.
అయితే.. ఇక నుంచి జపాన్ విమానాశ్రయాల్లో ఆ పదాన్ని వినలేం. ఎందుకంటే.. లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అని ఇక నుంచి అక్కడి విమానాశ్రయాల్లో అనరు.
సాధారణంగా అక్కడి ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు స్వాగతం పలికేటప్పుడు, బోర్డింగ్ టైమ్ లో ఎయిర్ లైన్స్ సిబ్బంది.. లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అని సంభోదిస్తుంటారు. కానీ.. ఇక నుంచి అలా పిలవరు.
జపాన్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ప్రయాణికులకు లింగ భేదాలు, జాతి భేదాలు… ప్రాంతీయ భేదాలు లేని వాతావరణాన్ని ఎయిర్ పోర్టుల్లో కల్పించాలని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అనే పదం.. లింగ భేదాన్ని ఎత్తి చూపేలా ఉందని ప్రభుత్వం భావించింది. ఇక నుంచి అక్కడ ఎవ్రీవన్ లేదంటే ఆల్ ప్యాసెంజర్స్ అని పిలవనున్నారు.
లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అని పిలవడంపై ప్రయాణికులు కూడా కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారట. వాళ్ల నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదట.
జపాన్ లో లింగ వివక్షను అస్సలు ఒప్పుకోరు. అందుకే.. జపనీస్ భాషలో లింగభేదాన్ని చూపించే పదాలను ఇప్పటికే అక్కడ నిషేధించారు. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలోని లేడిస్ అండ్ జెంటిల్ మెన్ ను నిషేధించారు. అక్టోబర్ 1 నుంచే ఆ నిషేధం అమలులోకి రానుంది.