Jhanvi Kapoor: విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Jhanvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి మన అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను,ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

జాన్వీ కపూర్ ఇప్పటికే గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి జాన్వికపూర్ తెలుగు ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాన్వీకపూర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ సినిమాను రూపొందింస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ సినిమా తర్వాత మళ్లీ విజయ్ తోనే మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ ని తీసుకోవాలని భావిస్తునట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని సమాచారం. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వుంది.