Jhanvi Kapoor: తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం అమరన్. ఇటీవలే దీపావళి పండుగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2014లో జమ్మూ కాశ్మీర్ గురువాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంది. ఈ సినిమాను చూసి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ పొగడ్తల వంశం కురిపించారు. పోస్టుల మీద పోస్టులు చేశారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ఈ సినిమాఫై స్పందిస్తూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం ఈ సినిమాపై స్పందించింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో వీక్షించిన జాన్వీ కపూర్ ఈ సినిమాఫై రివ్యూ ఇచ్చారు. కాగా ఈ మేరకు జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. అమరన్ నా హృదయాన్ని కదిలించింది. ఇందులోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి అని రాసుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో ముకుంద్, ఇందు మధ్య సన్నివేశాలు హృద్యంగా తెరకెక్కించారు.
వ్యక్తిగత జీవితమే కాకుండా, మరోవైపు వృత్తి జీవితాన్నీ అంతే సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సింది. హృద్యమైన ఒక.ప్రేమకథతో పాటు, దేశభక్తిని రగిలించే సైనికుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.