జగన్ కంచుకోట ‘జమ్మలమడుగు’లో పవన్ ప్రకంపనలు 

జనసేన పార్టీకి రాయలసీమలో గమనించదగిన రీతిలో కూడ పట్టు లేదనేది వాస్తవం.  సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీయే రాయలసీమలో నిలబడటానికి నానా యాతనా పడుతోంది.  అలాంటిది జనసేనకు పట్టుందని ఎలా అనగలం.  కానీ పవన్ మాత్రం పట్టు లేదు, బలం లేదు అంటూ వెనకడుగు వేయట్లేదు.  సమస్యలను ఎలుగెత్తి చెప్పడం, బాధితుల తరపున నిలబడటమే తన పని అని చెబుతుంటారు కాబట్టి పట్టున్న ప్రాంతాల్లో ఎలాగైతే పనిచేస్తున్నారో పట్టులేని రాయలసీమ మీద కూడ అలాగే స్పందిస్తున్నారు.  వైఎస్ఆర్ కడపజిల్లా జమ్మలమడుగులోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్లగ్రామస్థుల వరద నీటి సమస్యను చర్చకు తెచ్చారు పవన్. 

Janasena raises voice in Jammalamadugu 
Janasena raises voice in Jammalamadugu 

జమ్మలమడుగు అంటే వైఎస్ కుటుంబానికి మరో పులివెందుల లాంటిది అంటుంటారు.  అక్కడంతా నడిచేది వారి హవానే.  దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా నడవగా తర్వాత వైసీపీ టర్న్ మొదలైంది.  అంటే వైఎస్ఆర్ ఆతర్వాత జగన్ అన్నమాట.  జిల్లాలో కూడ జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది.  ఆ నియోజకవర్గంలో పైచేయి సాధిస్తే దాని ఎఫెక్ట్ జిల్లాలో మిగిలిన 9 నియోజకవర్గాల్లో ఇంకో మూడు నాలుగు నియోజవర్గాలు ప్రభావితం అవుతాయి.  అందుకే వైఎస్ జగన్ ఆ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి ఉంచుతారు.  

Janasena raises voice in Jammalamadugu 
Janasena raises voice in Jammalamadugu 

ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే జనసేన గొంతుక వినిపిస్తోంది.  తాళ్లప్రొద్దుటూరు గ్రామస్తులు గండికోట వరద నీటి ముంపుకు గురవుతున్నారు.  ఇప్పటికే రిజర్వాయర్లో 15 టీఎంసీల నీరు నిండుకోగా నీటి మట్టం ఇంకా పెరుగుతోంది.  దీంతో వరద నీరు గ్రామాల్లోని ఇళ్లలోకి చేరింది.  దీంతో గ్రామస్తులు మొకాటి లోతు నీళ్లలో మినిగి నానాఅవస్థలు పడుతున్నారు.  ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం రిజర్వాయర్లో 20 టీఎంసీల వరకు నీటిని నింపాలని ప్లాన్ చేసింది.  ఇలా అనుకున్నప్పుడు ముందుగానే గ్రామస్థులకి నష్టపరిహారం అందించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.  కానీ పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగింది.  తీరా వరద ముంచెత్తడం మొదలయ్యాక పరిహారం పంపిణీ స్టార్ట్ చేశారు. 

Janasena raises voice in Jammalamadugu 
Janasena raises voice in Jammalamadugu 

దీంతో గ్రామస్థులు నీళ్లలోనే ఉండి నిరసన తెలుపుతున్నారు.  దీన్నే జనసేన క్వశ్చన్ చేస్తోంది.  గ్రామస్తుల భద్రతకు భరోసా ఇవ్వాలని, బలవంతపు తరలింపులు తగవని, నిర్వాసితులతో తక్షణం సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  ఇప్పటికే లోకల్ జనసేన శ్రేణులు అక్కడి నిర్వాసితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.  వాస్తవానికి జనసేన చర్యతో వైసీపీ పునాదులేవీ కదిలిపోవుకానీ జగన్ కంచుకోటలో పవన్ గొంతుక వినిపించడానికి ఇదొక అవకాశమైందని అనొచ్చు.