Kiran Royal: తిరుపతి జనసేన ఇన్చార్జి కిరణ్ రాయల్ గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన లక్ష్మీ అనే మహిళతో అభ్యంతరకరంగా వ్యవహరించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే కిరణ్ రాయల్ వార్తలలో నిలిచారు.
లక్ష్మీ అనే మహిళా గత మూడు రోజుల క్రితం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా కిరణ్ రాయల్ తనని నమ్మించి మోసం చేశారని తన నుంచి కోటి రూపాయలు నగదుతో పాటు 25 సవర్ల బంగారు నగలను కూడా తీసుకొని నన్ను ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఈమె ఒక వీడియో విడుదల చేశారు.
కిరణ్.. లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్లిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంటి లోపలకు వెళ్తున్న దృశ్యాలు, బయటకు వస్తున్న దృశ్యాలు క్లియర్ గా కనిపించాయి దీంతో ఈయన కాస్త వివాదంలో చిక్కుకున్నారు. అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని, వైసిపి వారు ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని కిరణ్ రాయల్ తెలిపారు.
ఈ క్రమంలోనే తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి కిరణ్ ఫిర్యాదు చేశారు. 10 ఏళ్ల క్రితం సెటిల్‌మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు రాజకీయం చేయడం వైసీపీకే దక్కిందన్నారు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలి వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఇక తిరుపతి జనసేన ఇన్చార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గురించి ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కిరణ్ రాయల్‌పై వస్తోన్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అధినేత పవన్ కళ్యాణ్. విచారణ పూర్తయ్యేవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు
