Nagababu: పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చిన నాగబాబు… నువ్వు పీకిందేమీ లేదంటూ?

Nagababu: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ సమీపంలో జయకేతనం పేరుతో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లక్షలాదిమంది అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ పిఠాపురం వర్మకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు తానే కారణమంటూ కొద్దిరోజుల క్రితం వర్మ పరోక్షంగా తెలిపారు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ఆయన డిలీట్ చేశారు కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.

తాను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవలేరన్న ఉద్దేశంతో ఆయన పోస్ట్ చేశారని అందరూ భావించారు. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు వర్మ వ్యాఖ్యలకు పరోక్షక కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీ సాధించడానికి రెండే కారణాలని తెలిపారు. అందులో పవన్ కళ్యాణ్ ఒక కారణమైతే రెండో కారణం జనసైనికులు కార్యకర్తలు అంటూ తెలిపారు.

పవన్ కళ్యాణ్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ ఈ సందర్భంగా నాగబాబు వర్మకు కౌంటర్ ఇస్తూ పవన్ గెలుపు కోసం నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం నాగబాబు వర్మ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి అంతేకాకుండా జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా పిఠాపురంలో చర్చలు కూడా జరుగుతున్నాయి మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుంది అనేది తెలియాల్సి ఉంది.