జనసేన మళ్ళీ సైలెంట్ మోడ్‌లోకి, కానీ.. ఈసారెందుకిలా.?

జనసేన పార్టీ టైమ్ పాస్ రాజకీయాలు చేస్తోందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. జనసైనికులు సీరియస్ రాజకీయాలు చేస్తోంటే, జనసేనాని మాత్రం అప్పుడప్పుడూ రాజకీయాల్ని చేస్తుంటారు. పొలిటికల్ టూరిజం.. అని పేరు పెట్టొచ్చు జనసేనాని చేసే రాజకీయానికి.

ఇటు సినిమాలు, అటు రాజకీయం.. ఇదీ జనసేనాని పరిస్థితి. పోనీ, సినిమాలైనా రెగ్యులర్‌గా చేస్తున్నారా.? అంటే, అక్కడా కొంత గందరగోళం వుంది. మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్ యాక్టివ్ అయ్యారు. జనవాణి అన్నారు, జనసేన కౌలు రైతు భరోసా యాత్ర అన్నారు.. వెరసి, చాలా యాక్టివ్‌గా కనిపించారు.

జనసైనికుల్లోనూ కొత్త ఉత్సాహమొచ్చింది. జనసేన నాయకులూ మరింత యాక్టివ్ అయ్యారు.. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శలతో, ప్రతి విమర్శలతో చీల్చి చెండాడుతున్నారు. ఇంతలోనే మళ్ళీ స్తబ్దత. జనసేనానికి ఒకింత అస్వస్థత చోటు చేసుకుంది. దాంతో, పార్టీ మొత్తం డీలా పడిపోయింది.

జనసేనాని కోలుకున్నారు.. మళ్ళీ జనంలోకి రాబోతున్నారు. కానీ, ఇలా ప్రతిసారీ జనసేన పార్టీ డల్ అయిపోతే ఎలా.? పోనీ, జనసేనాని నుంచి సోషల్ మీడియాలో ట్వీట్లు అయినా సరైనవి పడుతున్నాయా.? అంటే అదీ లేదు. అది ఆయన చేసే పని కాదు.. ఆయన సూచనతో ఓ టీమ్ చేస్తుంటుంది ఆ పని.

అన్నటికీ జనసేనాని నిర్ణయం తీసుకోవాల్సిందే. పార్టీకి సరైన యంత్రాంగం లేదు. జనసేనాని పవన్ సోదరుడు నాగబాబు అయినా, ఈ పరిస్థితుల్లో పార్టీని యాక్టివ్‌గా వుంచేందుకు ప్రయత్నించాలి కదా.?