పవన్ కళ్యాణ్ సినిమాల్లో విజయాన్ని సాధించి, అత్యున్నత స్థాయికి చేరుకున్నారు కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా వెనకపడ్డారు. 2019 ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. సినిమాల ద్వారా తనకు వచ్చిన ప్రజాధారణను ఉపయోగించుకోవడంలో జనసేన అధినేత పవన్ సఫలం కావడం లేదు . ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన ఒక పొత్తుల పార్టీగా మారిందని, అసలు జనసేనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ నాయకులు అంటున్నారు. అందరూ అనుకున్నట్టుగానే బీజేపీనే జనసేనను నడిపిస్తుంది. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం మాత్రం బీజేపీ షాక్ ఇవ్వనుంది.
బీజేపీకి షాక్ ఇవ్వనున్న పవన్
ఏపీలో వైసీపీకి ధీటుగా ఎదిగేందుకు బీజేపీ, జనసేన కూటమి చూస్తోంది. ఇక ఈ కూటమిలో పెద్దన్నగా బీజేపీ ఉంటోంది. ఆ పార్టీకి ఏపీలో సీన్ ఏదీ లేకపోయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉండడం మోడీ ఇమేజ్ ని అడ్డుపెట్టుకుని నాదే పై చేయి అనేస్తోంది. ఈ నేపధ్యంలో అన్నింటా వెనకబడుతున్న పవన్ కళ్యాణ్ అటు మిత్ర పార్టీ బీజేపీకి, ఇటు బద్ధ శత్రువు జగన్ కి ఒకేసారి ఝలక్ ఇవ్వడం కోసం ఏకంగా జనంలోకే రాబోతున్నాడట. ఇప్పటిదాకా సభలూ సమావేశాలూ నిర్వహించే జనసేనాని ఇక మీదట జనం తో కలిపి అడుగులో అడుగు వేస్తాడట. అలా వారితో మమేకం కావడం ద్వారా తాను రాష్ట్రాధినేతను అని చెప్పుకునేందుకు జనమంతా ఒప్పుకునేందుకు వీలు ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడుట.
బీజేపీ పొత్తు తెగిపోతుందా!!
బీజేపీఎం పొత్తు పెట్టుకున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ కు ఎదో రకంగా ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. పొత్తు వల్ల పవన్ కు జరిగిన మంచి కంటే కూడా చెడే ఎక్కువగా ఉంది. ప్రజల నుండి కూడా పొత్తుపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పవన్ కళ్యాణ్ అమరావతినే రాజధాని చెయ్యాలంటే బీజేపీ తాము ఏమి చేయలేమని చూస్తూ కూర్చుంటుంది. అలాగే మొన్న తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదట పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత బీజేపీ కోరడంతో తప్పుకున్నారు. ఇలా బీజేపీ నుండి మొదట నుండి కూడా ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది.కాబట్టి త్వరలో ఈ. బంధం తెగిపోనుందని వార్తలు బయటకు వస్తున్నాయి.