ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి రైతులతో జై కొట్టించే వ్యూహంతో ముందుకెళ్తున్నారా? మూడు రాజధానుల్ని ఏ ప్రాంత వాసులైతే వద్దంటున్నారో? వాళ్లతోనూ జగన్ జై కొట్టించనున్నారా? అలాంటి పక్కా వ్యూహంతో జగన్ సర్కార్ పావులు కదుపుతుందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. మూడు రాజధానుల జగన్ ప్రపోజల్ తో అమరావతిలో ఎలాంటి జ్వాలలు ఎగసిపడ్డాయో తెలిసిందే. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని..కచ్చితంగా పరిపాలనా రాజధాని కూడా అక్కడే ఉండాలని రైతులు సహా అంతా ధర్నాలు..రాస్తారాకోలకు దిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ అందోళనల కంటే అక్కడ రియల్ దందా అన్నది ఓ రేంజ్ లో జరిగింది. రాజధాని పేరుతో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం జరిగింది. భోగస్ రైతుల తెరపైకి తెరపైకి వచ్చారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బినామీల పేరిట అభివృద్ధి భూములు గా మారాయి. రాజధాని ప్రకటన ముందు నుంచే సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత. ప్రకటన తర్వాత దోపిడి పీక్స్ లో జరిగింది. ఇదంతా ఓపెన్ గానే జరిగింది. అమరావతి లో రాజధాని అంటే ఒక సామాజిక వర్గం అభివృద్ధి అన్నతంగా బట్టబయలైపోయింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఇలా జరిగితే రాష్ర్ట ప్రజలు ఇంకా అంథకారంలో మగ్గిపోతారని..భావి తరాల భవిష్యత్ శూన్యమేనని భావించి మారు మాట్లాడకుండా అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నాటి నుంచి నేటి వరకూ అవిశ్రామంగా రాష్ర్టానికి మూడు రాజధానుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జగన్ అసలైన రైతుల్ని విస్మరించడం జరిగింది. అదే జగన్ చేసిన అతిపెద్ద తప్పుగా సంక్రమించింది. అయితే ఇప్పుడా తప్పును సరిదిద్దుకోవడానికి రంగం సిద్దం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ కమిటీని వేసి రైతుల ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. తద్వారా వాళ్ల సమస్యలను తెలుసుకుని వాళ్లకు కావాల్సింది ఏంటో? నెరవేర్చితే సమస్యే ఉండదని భావిస్తున్నారు. అమరావతి ఎలాగూ శాసన రాజధానిగా ఉంటుంది. అందులో ఎలాంటి అడ్డంకి లేదు. కాబట్టి రైతు సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేస్తే సమస్యే ఉత్ఫనమయ్యేది కాదని ఆలస్యంగా తట్టినట్లు తెలుస్తోంది.