Y.S.Jagan: జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు అంటే పోలీసులకు కత్తి మీద సాము అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటనకు వెళ్తున్నారంటే పెద్ద ఎత్తున కాన్వాయ్ బయలుదేరడమే కాకుండా లక్షల సంఖ్యలో జనాలు గూమి గూడుతున్నారు తద్వారా పోలీస్ బందోబస్తుకు కూడా కష్టతరం అవుతుంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు, ఒంగోలు, పల్నాడు పర్యటనలలో భాగంగా చోటు చేసుకున్న సంఘటనలతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లాలి అంటే పోలీసుల నుంచి కూడా అనుమతి రాని పరిస్థితి ఏర్పడ్డాయి.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి జూలై 9వ తేదీ చిత్తూరు జిల్లా, బంగారు పాల్యం పర్యటనకు వెళ్తున్నారు. అయితే మొదట ఈయన పర్యటనకు పోలీసుల నుంచి అనుమతి లేకపోయినా తదుపరి భారీ నిబంధనలను తెలియజేస్తూ పోలీసులు అనుమతి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హెలిపాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అదేవిధంగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ విస్తీరణ చాలా తక్కువగా ఉంది సుమారు 500 మంది వరకు మాత్రమే ఉండేలాగా పోలీసులు అనుమతి తెలిపారు.
ఎల్లుండి వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసుల అనుమతి
మార్కెట్‌యార్డు చిన్నది కావడంతో 500 మందికి మాత్రమే అనుమతి
ఇప్పటికే హెలిప్యాడ్‌కు అనుమతిచ్చిన చిత్తూరు పోలీసులు
హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి
ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని పోలీసుల నిబంధన pic.twitter.com/XJN9EjRQE5
— BIG TV Breaking News (@bigtvtelugu) July 7, 2025
హెలిపాడ్ కు పోలీసులు అనుమతిచ్చారు కానీ ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అలాగే స్థానిక వైసీపీ నేతలకు కూడా పలు ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల పల్నాడు పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా సుమారు పదివేల మంది వరకు కార్యకర్తలు పాల్గొంటారని, అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్థానిక వైసీపీ నేతలు పోలీసులను కోరారు అయితే పోలీసులు అందుకు పర్మిషన్ ఇవ్వకపోగా కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది.
