KTR: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం 164 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించింది. ఇలా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అందించారు. ఇక 2024 ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని అందరూ భావించారు కానీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి పై పోటీ చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిపాలు అయ్యారు.
కూటమి 164 స్థానాలలో విజయం సాధించగా జగన్ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో వైసిపి నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మీడియా చిట్ చాట్ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. జగనన్న ఓడిపోయిన 40 శాతం ఓటు రావడం మామూలు విషయం కాదని తెలిపారు.
ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారని ఆయన కనుక కూటమి ఏర్పాటు చేయకపోయినా, సింగిల్ గా పోటీ చేసిన పరిస్థితులు మరోలా ఉండేవని కేటీఆర్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం షర్మిలను కూడా ఒక పావులాగా వాడుకున్నారే తప్ప ఇందులో ఆమె పాత్ర ఏమాత్రం లేదని కేటీఆర్ తెలియచేశారు. ఇక ఈ ఎన్నికలలో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలలో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించే కేతిరెడ్డి ఓడిపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ వైసీపీ ఓటమి గురించి, అలాగే కేతిరెడ్డి ఓటమి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
