ఆ విషయంలో జగన్ ధోరణి తప్పు : అటార్నీ జనరల్

cm jagan

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్ వి రమణ, హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాకుండా, దానిని ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం తో మీడియా కు విడుదల చేయటంపై దేశ వ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ దీనిపై సృష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

kk venugopal

  ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ దీనిపై సృష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సీఎం జగన్ న్యాయమూర్తులపై లేఖ రాయటం, దానిని మీడియా సమావేశంలో బహిర్గతం చేయటం అనేది కోర్టు ధిక్కరణ ధోరణి కిందకే వస్తుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలోని అన్ని విషయాల గురించి జస్టిస్ గారికి తెలుసు, అయినాగానీ దానిని మీడియా ముందుకు తీసుకురావటం కరెక్ట్ కాదు, పైగా సీఎం జగన్ వాటిని బయటపెట్టిన సమయం, సందర్భం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసులు విషయంలో విచారణ త్వరగా పూర్తిచేయాలని సెప్టెంబర్ 16 న జస్టిస్ రమణ ఉత్తర్వలు జారీచేశారు. ఆ తర్వాత జగన్ లేఖ రాయటం, దానిని బహిర్గతం చేయటం చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి.

  ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానిపై నేను మాట్లాడటం సరైంది కాదంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సృష్టం చేశారు. అటార్నీ జనరల్ అంటే భారత్ ప్రభుత్వ చీఫ్ లీగల్ అడ్వైజర్ కాబట్టి అతని అభిప్రాయమే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమే అని అనుకోవచ్చు. జగన్ మరియు అజయ్ కల్లం మీద కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, న్యాయమూర్థులపై అనుచిత ఆరోపణలు చేస్తూ లేఖ రాయటంతో పాటు, అనుచిత వ్యాఖ్యలు చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టటానికి అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సుప్రీం కోర్టు న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కు లేఖ రాయటంతో అటార్నీ జనరల్ ఆ లేఖకు సమాధానంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం గా మారిపోయింది.