కరోనా పేరుతో కార్పోరేట్ ఆసుపత్రులు ఎలాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయో తెలిసిందే. ఆరంభంలో ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించినా ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పిపోయే సరికి వైద్యం ప్రయివేట్ ఆసుపత్రులకి ఇచ్చేసింది. దీంతో ప్రయివేటు యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. ఇష్టానుసారం ఫీజులు వసూల్ చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే యాజమాన్యాలు ప్రతి దాడికి దిగుతున్నారు. డబ్బు కట్టి బాడీనీ పట్టికెళ్లండని దౌర్జన్యం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సభ్య సమాజంలో ఉన్నామా! స్మశానంలో ఉన్నామా? అని కచ్చితంగా ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్న డాకర్ట్లు..యాజమాన్యాలు గుండెలు మీద చేయి వేసుకుని సమాధానం చెప్పాలి.
ఓ డాక్టరే నేరుగా ఏపీలో ప్రయివేటు ఆసుపత్రుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని వాట్సాప్ లో రివీల్ చేసారింటే పరిస్థితిని అంచనా వేయోచ్చు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రితో పాటు పలు కార్పోరేట్ ఆసుపత్రులు కరోనా పేరు చెప్పి కోట్లు గడించాయి. పది రోజుల కొవిడ్ వైద్యానికి 5 లక్షలు.. ఏడు రోజులకు 4 లక్షలు.. ఐదు రోజులకు 3లక్షలు చొప్పున వసూళ్లు చేస్తున్నాయి. బీమా క్లైమ్ చేసుకోవడానికి రసీదులు కావాలంటే పేషెంట్ తాలుకా కుటుంబానికి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఆ డబ్బును కూడా ఆసుపత్రులో బొక్కేస్తున్నాయో! ఏమో! దీనికి తోడు కరోనా పెషెంట్లు కావడంతో రోగి వద్దకు ఎవర్నీ పంపడం లేదు.
రోగికి ట్రీట్ మెంట్ ఎలా అందుతుంది. వాళ్ల పట్ల డాక్టర్లు ఎలా వ్యవహరిస్తున్నారు? అన్నది కూడా తెలియకుండా పోయింది. రోగి తాలుకా కుటుంబం కేవలం కార్డుల ద్వారా డబ్బులు చెల్లడించడం వరకే పరమితం. మిగతాది అంతా దేవుడు దయే అన్నట్లే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆసుపత్రులపై జగన్ కొరడా ఝుళిపించాల్సిందేనని ప్రజలు కోరుతున్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే ఏ ఆసుపత్రిని వదలకుండా జగన్ ఎటాక్ చేయాలని ఆశిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.