జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో తొలి నుంచి మొట్టికాయలు తప్పడం లేదన్నది తెలిసిందే. వివిధ అంశాలపై ప్రభుత్వం తరుపున దాఖలైన పిటీషన్లు సహా హైకోర్టు కొట్టేయడం..వాటిపై సవాల్ చేస్తూ సుప్రీకోర్టుకు వెళ్లడం…అక్కడా కేసు బలంగా నిలబడకపోవడం వంటి సంఘటనలు ప్రభుత్వానికి భంగపాటుగా మారాయి. అయితే ఇన్నాళ్లు తగిలిన ఎదురు దెబ్బలు వేరు..ఇకపై తగిలే దెబ్బలు వేరని ప్రభుత్వం ముందుగానే మేలుకున్నట్లు తాజా చర్యలను బట్టి తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లు రద్దు కోర్టులో పిటీషన్లు పడ్డ సంగతి తెలిసిందే. వీటిపై గవర్నర్ రాజముద్ర తర్వాత ప్రభుత్వానికి సంకటంగా మారింది.
ఈ రెండింటిపై ప్రభుత్వం ఎంత ఏమాత్రం గా ఉన్నా తిప్పలు తప్పవు. అందుకే ఈరెండింటిపై పడే పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. నిజా,నికి వీటిపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా శ్యామలరావు అనే సీనియర్ అధికారిని తాజాగా నియమించారు. సీఆర్ డీఏ, పాలన వికేంద్రీకరణ బిల్లులపై శ్యామలరావు ఇకపై కౌంటర్లు దాఖలు చేయనున్నారు. ఒకవేళ ఆయన సెలవులో గనుక ఉంటే? ప్రత్యామ్నాయంగా మరో అధికారిని కూడా రెడీ చేసారు. ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురైన గత అనుభవాల నేపథ్యంలో కొంత మంది న్యావాదుల్ని తొలగించి కొత్త వారిని నియమించని సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ అదే పరిస్థితి ఎదురవ్వడంతో వారిని తొలగించడం జరిగింది.