Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దిశగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.
ఇక ఈ ఎన్నికల గురించి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. జమిలీ ఎన్నికలు కనక వస్తే ముందస్తుగానే ఎన్నికలు వస్తాయని అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దని తెలిపారు. ప్రజల విషయంలో గొంతు విపడానికి ఎక్కడ రాజీ పడాల్సిన పనిలేదని తెలిపారు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నామని ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు.
వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనము అసెంబ్లీకి వెళ్లిన వెళ్లకపోయినా కూడా ప్రజల సమస్యపై పోరాటం చేస్తూనే ఉంటామని వెల్లడించారు.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని… మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని కోరారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలని… ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని వెల్లడించారు.
ప్రజల సమస్యలపై పోరాటం చేసే విషయంలో ఎవరు కూడా వెనకడుగు వేయద్దని తెలిపారు. ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటాను అంటూ జగన్ ఈ సందర్భంగా భరోసా కల్పించారు. అయితే జమిలి ఎన్నికల గురించి మరోసారి ఈయన చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి.