ఆ జిల్లాలో అన్న‌ని లేపారు..త‌మ్ముడ్ని తొక్కారు?

ఏపీలో లోక్ స‌భ స్థానాలు ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు నేప‌థ్యంలో శ్రీకాకుళం నుంచి ఆ జిల్లా ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ జిల్లాని విభ‌జిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ప‌క్క జిల్లాలో క‌లిసి పోతాయ‌ని, రాజ‌కీయంగాను ఇబ్బందులు ఎదుర్కుంటామ‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసారు. ఆ జిల్లా వాసుల నుంచి కూడా అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ఓ ప‌క్క జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన క‌మిటీ చ‌క‌చ‌కా అన్ని జిల్లాల మండ‌లాల నుంచి నివేదిక‌లు తెప్పించుకుని ప‌నులు మొద‌లు పెట్టేసింది. అటు ధ‌ర్మాన విజ్ఞ‌ప్తి పై సీఎం స్పందిచ‌క‌పోవ‌డం.. ఇటు ఏర్పాటు చూస్తుంటే ధ‌ర్మాన అభ్య‌ర్ధ‌న‌ని జ‌గ‌న్ లైట్ తీసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది.

ప్ర‌తిగా ధ‌ర్మ‌న ప్ర‌సాద‌రావు అన్న‌య్య అయిన‌  ధ‌ర్మాన కృష్ణ దాస్ ని మంత్రి నుంచి ఉపముఖ్య‌మంత్రిగా ప్ర‌మోట్ చేసారు. అలా తాత్క‌లికంగా ప్ర‌సాద‌రావు నోరు నొక్కిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ వ్యూహం అదేనా? లేక అక్క‌డా త‌న బ్రాండ్ చూపించే ప్ర‌య‌త్నం చేసారా? అన్న అనుమానం ఇప్పుడు వ్య‌క్తం అవుతోంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో చాలా సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. రాజ‌కీయంగా ఆ జిల్లాలో బాగా ప‌ట్టుకున్న నాయ‌కుడు. ఆ జిల్లా రాజ‌కీయాన్ని శాషించే స‌త్తా ఉన్న నాయ‌కుడు.  రాజ‌కీయాల‌లోకి తెచ్చింది ఎమ్మెల్యేగా గెలిపించింది అన్న‌య్య‌ ప్ర‌సాద‌రావే.

అన్న‌య్య‌ గెలుపు కోసం ప్ర‌సాద‌రావు ఎంతో శ్ర‌మించారు. కానీ జ‌గ‌న్ ఇప్పుడు సీనియ‌ర్ నేతైన ప్ర‌సాద‌రావుని ప‌క్క‌న‌బెట్టి..కృష్ణ‌దాస్ ని ఉప ముఖ్య‌మంత్రిగా ప్రమోట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌సాద‌రావుని రాజ‌కీయంగా బ‌ల‌హీన ప‌రిచి..కృష్ణ దాస్ తో గేమ్ మొద‌లు పెట్టిన‌ట్లు వినిపిస్తోంది. వైఎస్సార్ బొమ్మ‌తో గెలిచార‌ని చెప్ప‌క‌నే జ‌గ‌న్ చెప్పిన‌ట్లు తాజా స‌న్నివేశాలు చెబుతున్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందువ‌ల్లే ధ‌ర్మన ప్ర‌సాద‌రావుకు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో గానీ, పార్టీ లో గానీ పెద్ద పీట వేయ‌లేదు అన్న చ‌ర్చ మ‌రోసారి సాగుతోంది.