తన జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలోచించలేదు. చేతిలో అధికారం లేకపోయిన రోజుల్లో కూడా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకొని తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చేసుకోవటంలో సఫలం అయ్యాడు,. కానీ జగన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో బాబుకు గడ్డు కాలం దాపురించింది. జగన్ వేసిన ఉచ్చులో చిక్కుకొని 2019 ఎన్నికల నాటికీ బీజేపీ కి దూరమై కాంగ్రెస్ తో జతకట్టాడు.
ఆ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి మరోసారి బీజేపీ అధికారంలోకి రావటంతో బాబుకు ఏమి చేయాలో పాలుపోలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా బాబు ఇప్పుడు బీజేపీతో దోస్తీ కోసం చూస్తున్నాడు. ఇక్కడ కూడా జగన్ మరోసారి బాబుకు ఆ అవకాశం లేకుండా చాలా చాకచక్యంగా బీజేపీ కి దగ్గరవుతున్నారు. చంద్రబాబు తన మీదున్న కేసులు నుండి తప్పించుకోవటానికి, గతంలో చేసిన అవినీతి తాలూకా కేసుల నుండి తన వాళ్ళని కూడా కాపాడటం కోసమే బీజేపీని ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇదే సమయంలో జగన్ కూడా టీడీపీ చేసిన అక్రమాలను బయటపెట్టి, ఒకరి తర్వాత మరొకరికి జైలు అనుభవం చూపించాలని గట్టిగా భావిస్తున్నాడు. ఇందులో భాగంగా మొదటిగా అచ్చెన్న నాయుడును జైలుకు పంపించి గట్టి హెచ్చరికలు జారీచేశాడు.
దీనితో టీడీపీ పార్టీలో అలజడి మొదలైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు జైలు నుండి బయటకు వచ్చిన అచ్చెన్న వైసీపీ ప్రభుత్వం మీదగాని, సీఎం జగన్ మీదగాని ఇప్పటివరకు ఒక్క విమర్శా కూడా చేయకపోవటం విశేషం. ఇక అచ్చెన్న నాయుడు తర్వాత ఆ స్థానంలో చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ బాబు రాబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ESI స్కాం కేసులో లోకేష్ హస్తముందని, అలాగే ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో కూడా అప్పటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ ప్రమేయం ఉందని, అందుకు తగ్గ సాక్ష్యాలు సీఎం జగన్ టేబుల్ మీద ఉన్నట్లు సమాచారం. ఏ నిమిషమైన జగన్ తలుచుకుంటే లోకేష్ కు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. దీనితో చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని తెలుస్తుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు భవిష్యత్తు మీద బాబుగారికి బెంగ పెట్టుకుందనే మాటలు వినిపిస్తున్నాయి.. మరి దీని చంద్రబాబు ఎలా బయట పడుతాడో చూడాలి.