పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అనే మహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ గొప్ప కార్యక్రమంపై పచ్చ మీడియా, టీడీపీ నేతలు ఎలా విషం చిమ్ముతున్నారో? కూడా తొలి నుంచి స్పష్టమవు తూనే ఉంది. పేదలకు ఇళ్లు ఇవ్వడం పచ్చ నేతలకు ఎంత మాత్రం ఇష్టం లేదని వాళ్ల వ్యాఖ్యలు..చేతలను బట్టే తెలుస్తోంది. దీనికి తగ్గట్టు జగన్ కు ఈ విషయంలో ఒడిదుడుకులు కూడా అలాగే ఎదురవుతున్నాయి. ఎంత వేగంగా పేదలకు పట్టాలిచ్చి…వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని ఆరాపటడుతున్నారో? ఈ కార్యక్రమం అంతకంతకు వెనక్కి వెళ్లిపోతుంది.
ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. స్వాతంత్ర్య దినోత్సవం సంద్భంగా ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మహత్తర కార్యక్రాన్ని చేపట్టనున్నట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియాకి, తెలుగు దేశం నేతలకి కావాల్సిన ప్రచారం స్టప్ దొరికింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన కార్యక్రమం నాల్గవసారి కూడా వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రభుత్వం తీరుపై ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య మొదలైన నీళ్ల యుద్ధం నేపథ్యంలో టీ-మీడియా కూడా జగన్ పై కక్షపూరిత వ్యాఖ్యలకు పురుడు పోస్తోంది. మొన్నటివరకూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని టార్గెట్ చేసిన టీ – మీడియా ఇప్పుడు నేరుగా జగన్ నే ఎక్కుపెట్టినట్లు అర్ధమవుతోంది. నాడు చంద్రబాబు నాయుడ్ని డీగ్రేడ్ చేసిన మీడియా నేడు జగన్ ని దిగజార్చే కథనాల వైపు అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. అలాగైతే టీ-మీడియాని పచ్చ బ్యాచ్ లో కలిపేయాల్సి ఉంటుంది అన్నది మర్చిపోవాల్సిన మాట కాదు అన్నది పలువురి వాదన.