AP: జగన్ వెంట జన సునామీ…. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు… ఏడాదిలోనే ఇంత మార్పా?

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఏపీ ప్రజలు ప్రతిసారి ఎన్నికలలో సంచలనమైన విభిన్న తీర్పు ప్రకటిస్తూ ఉంటారు.. ఒక్కసారి కూడా ఒక పార్టీ రెండు దఫాలుగా ఎన్నికలలో గెలిచిన సందర్భాలు లేవు. ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇస్తే మరోసారి ఇంకో పార్టీకే అధికారం అందిస్తారు.. ఇలా తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డిని కూడా 64 సీట్లతో గెలిపించారు.

ఇక 2019 ఎన్నికలలో భాగంగా వైసిపి కూడా ఊహించని విధంగా ఏకంగా 151 స్థానాలలో విజయం అందించారు. ఇకపోతే వైసిపి హయామంలో సంక్షేమ పథకాలను అందించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని ఫలితాలు చూస్తేనే స్పష్టమవుతుంది కూటమినేతలు కూడా కలలో ఊహించని విధంగా 164 స్థానాలలో విజయాన్ని కట్టబెట్టారు. ఇలా కూటమి భారీ మెజారిటీ సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది.

ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న కూటమికి అప్పుడే ఏపీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఏడాది కూడా గడవకుండానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వెంట జనం కదులుతూ జేజేలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో అసలు ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఇక కూటమికి వ్యతిరేకత ఏర్పడిందా అంటే అది లేదు కూటమికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది అలాగే చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే జగన్ వెంట ఈ జన సునామి రావడానికి కారణం ఏంటని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రజలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోరుకుంటున్నారా? జగన్ తిరిగే అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తారని భావిస్తున్నారా? అందుకే జగన్ వెంట అభిమానులు కార్యకర్తలు తరలి వస్తున్నారా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ వెంట ఈ స్థాయిలో అభిమానులు రావడం చూస్తుంటే కూటమినేతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.