గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఆత్మ లాగా వ్యవహరించేవాడు. వైఎస్ చేసే ప్రతిపనిలో, ప్రతి నిర్ణయంలో కేవీపీ ప్రమేయం ఉండేది, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ లో కూడా జగన్ కు ఆత్మ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, పార్టీలో నెంబర్ 2 గా అధికారం చెలాయిస్తున్నారు . జగన్ పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందు నుండే జగన్ కి విజయసాయి రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ వ్యాపార సలహాల్లో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర. ముఖ్యంగా జగతి పబ్లికేషన్ విషయంలో అన్ని విజయసాయి రెడ్డి చూసుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అదే కేసులో విజయసాయి రెడ్డి ప్రధాన ముద్దాయిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. జగతి పబ్లికేషన్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లలో జగన్ కు సంబంధమే లేదని.. మొత్తం విజయసాయిరెడ్డినే చేశారన్నట్లుగా జగన్ తరపు న్యాయవాదులు వాదిస్తూండటమే దీనికి కారణం. జగతి పబ్లికేషన్స్ కేసులో దండమూడి అవినీంద్రకుమార్, మాధవ్ రామచంద్ర, టీఆర్ కన్నన్ అనే వ్యక్తులు 2007-2009 మధ్య రూ. 35 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. షెర్ వాల్యూను.. డెలాయిట్‌తో కలిసి అక్రమంగా పెంచి.. చూపించి తమకు ఒక్కో షేర్‌ను విజయసాయిరెడ్డి రూ. 350కు అమ్మి మోసం చేశారని వారు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తమకు పైసా కూడా డివిడెండ్ ఇవ్వలేదని వాపోయారు.
నిజానికి ఆర్థిక నేరాల్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరో చూస్తారు, ఆ కోణంలోనే జగన్ ను ముద్దాయిగా పేర్కొన్నారు. కానీ జగన్ న్యాయవాదులు మాట్లాడుతూ ఈ కేసులో ఎక్కడ కూడా జగన్ పేరు ప్రస్తావించలేదు, కాబట్టి ఈ కేసు నుండి జగన్ ను డిశ్చార్జ్ చేయాలనీ కోరటం విశేషం. ఇందులో విజయసాయి జగతి షేర్ విలువని 10 రూపాయల నుండి 350 రూపాయలు చూపించి అమ్మటం వలన ఆయనకు వచ్చే లాభం ఏమి లేదు. అది ఎవరి కోసం చేసారో కూడా ఈజీగానే అర్ధం అవుతుంది, కానీ ఇందులో జగన్ కు అసలేమీ సంబంధం లేదన్నట్లు ఆయన తరుపు న్యాయవాదులు చెప్పటం విశేషం. మరి ఆ జగతి పబ్లికేషన్ విషయంలో షేర్ లు పెంచి ఆర్జించిన సొమ్ము ఎవరి ఖాయలోకి వెళ్ళాయో ఏమో.. విజయసాయి రెడ్డిని అడిగితే కానీ అసలు విషయం బయటకు రాదేమో..!