రాజీనామా చేస్తేనే అభివృద్ధి.. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇద్దరేనా?

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలకు సంబంధించి పెద్దగా అభివృద్ధి జరగలేదని చాలామంది భావిస్తారు. టీ.ఆర్.ఎస్ సర్కార్ కూడా సంక్షేమ పథకాలను బాగానే అమలు చేస్తున్నా అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు అభివృద్ధి దిశగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేయడం గమనార్హం.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే తెలంగాణ సర్కార్ లో కదలిక వచ్చిందని నెటిజన్లు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నిక వల్లే కేసీఆర్ సర్కార్ చేనేత కార్మికులకు పింఛన్లను పెంచింది. ప్రస్తుతం మునుగోడులో రోడ్లు కూడా వేస్తుండటంతో మునుగోడు ప్రజలు సంతోషిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అభివృద్ధి చేస్తారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే ఆలోచనతో జగన్ ఏకంగా 66 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. తప్పనిసరిగా గెలవాల్సిన స్థానాలలో మాత్రమే అభివృద్ధి జరుగుతుండటం సామాన్య ప్రజలను బాధ పెడుతోంది. పాలకులు సామాన్య ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.

రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక తప్పనిసరిగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడితే మాత్రమే రాజకీయ నాయకులు నిధులు విడుదల చేస్తుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితి వల్ల ప్రజలకు అవసరమైన అభివృద్ధి మాత్రం జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్, కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులలో పావు వంతు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేటాయించినా రాష్ట్రాల రూపురేఖలు మారిపొయే ఛాన్స్ అయితే ఉంది.