ఎన్నికలకు ముందు మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ జనసేన అధినేత వ్యక్తిత్వం..విధి విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరి తర్వాత పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏపార్టీలోనూ యాక్టివ్ గా లేరు. అయితే జేడీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ప్రశంసించడం విశేషం. ఒకప్పుడు అక్రమ ఆస్తుల కేసుల జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించిన జేడీనే ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని పనితీరును ప్రశంసించడం అంతాటా హాట్ టాపిక్. ఎన్నికల మ్యానిఫెస్టో లో భాగంగా ప్రజలకు ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని నిర్వర్తిస్తూ జగన్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే జగన్ ని ఆకాశానికి ఎత్తేసిన జేడీ మరోసారి సీఎంకు జేజేలు పలికారు. మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల ముందు వరకే పరిమితమవుతుంది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత కూడా పని చేస్తుందని నిరూపించారన్నారు. జగన్ ఏడాది పాలనపై స్పందించి ఆయనకు త్వరలోనే మార్కులు వేస్తానని ఓ ఇంటర్వూలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకెళ్తుందని, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని ఎన్నికల తర్వాత చేసి చూపిస్తు
న్నారని కొనియాడారు. కొందరి మేనిఫెస్టో కేవలం విజయం కోసమే అనుకుంటున్నారు. కానీ జగన్ ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారన్నారు.
అక్రమ ఆస్తుల కేసు విషయంలో జగన్ ని జైలుకు పంపించడంలో జేడీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత ఓ సారి విమానాశ్రయంలో ఇద్దరూ ఎదరుపడ్డారుట. ఆ సమయంలో ఒకరికొకరు నమస్కారం అంటే నమస్కారం అని సంస్కరించుకున్నారుట. జేడీగా ఉన్నప్పుడు తాను కేవలం డ్యూటీ మాత్రమే చేసానని..వ్యక్తిగత కక్షలేవి లేవని తెలిపారు. నిజాయితీ గల ఏ ఆఫీసర్ అయినా అలాగే చేస్తారని, ఆ సమయంలో తన విధులు మినిహా ఇంకేం కనిపించ వన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ లో రాజకీయ పరిపక్వత కనిపించలేదని, సీరియస్ గా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం నచ్చలేదని మరోసారి గుర్తు చేసారు.