AP: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం… మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు!

AP: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండి పడ్డారు. అంతేకాకుండా ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈయన ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనది కాదని హెచ్చరించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎన్ని అమలు పరచాలో చూపించాలని సత్య కుమార్ ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయామంలో రైతు భరోసా పేరిట ఎంతమందికి ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పాలని సత్యకుమార్ తెలిపారు. అయితే మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి ఒక్క రైతు ఖాతాలో 20వేల రూపాయల జమ చేస్తున్నారని ఈయన వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా జగన్ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ జగన్ ఆరోపణలు చేయడం సరైనది కాదని అవినీతి కేసు కింద అరెస్ట్ అయిన వారిని పరామర్శించడం కోసం జైలుకు వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఏదో ఒకరోజు వీరందరి లాగే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లాల్సిందే అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఏపీలో మద్యం స్కాంలో భాగంగా పలువురు పేర్లను చార్జిషీట్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు పాట పాడుతూనే ఉన్నారు తాజాగా సత్యకుమార్ సైతం జగన్ అరెస్ట్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.