జగన్ ఏం చేసినా మంచికోసమే .. రోజా కి మంత్రి పదవి ఇవ్వకుండా ఎంత మేలు చేశాడో చూడండి !

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో ఒక అంశంతో ఎప్పుడు శీతాకాలాన్ని మరిపిస్తుంటాయి.. ఈ మధ్యకాలంలో అయితే ఎన్నో వివాదాల మధ్య నలిగిపోతున్న ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలియదు.. ఇకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా తనకంటూ ఒక ఇమేజ్‌ను సృష్టించుకున్నారు.. రోజా ఏ పార్టీలో ఉన్నాగానీ ప్రత్యర్ధులను మాత్రం తన మాటలతో చెండాడేవారు.. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు వైఎస్ జగన్ ఏ పదవి కట్టబెడతారో అని అంతా ఎదురుచూశారు.. కానీ వైఎస్ జగన్ మాత్రం రోజా విషయంలో ఆచితూచి వ్యవహరించారు.. చివరికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు..

ఇకపోతే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన బాధ్యత నిర్వహిస్తూనే జబర్ధస్త్ కామెడీ షో జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో రోజాకు గనుక మంత్రి పదవి ఇస్తే తన నియోజక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేది.. కానీ ఆమెకు మంత్రిపదవి రాకపోవడమే మంచిది అయ్యిందంటున్నారు.. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా నగరి మీదనే దృష్టి పెట్టి టీడీపీని కోలుకోకుండా చేసే అవకాశాన్ని చాలా చక్కగా వాడుకుంటున్నారు.. ఇదే కాకుండా నగరి నియోజకవర్గంలో రోజురోజుకూ గ్రిప్ పెంచుకుంటూ, ఆ నియోజక వర్గంలోని లోపాలను అవకాశంగా మలచుకుని టీడీపీ క్యాడర్ ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు ఆర్కేరోజా..

ఏపీ సీయం కోసం, వైసీపి పార్టీ కోసం తాను చేయాలనుకున్న పనిని పకడ్బందిగా అమలు చేస్తూ తాజాగా 41 మంది టీడీపీ సానుభూతి పరులైన వారి కుటుంబాలకు వైసీపీ కండువా కప్పారు.. దీంతో నగరిలో టీడీపి భూస్దాపితం కావడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది.. ఇక జగన్ తీసుకున్న కీలక నిర్ణయం ఆ పార్టీకి ఈ విధంగా తోడ్పడుతుంది.. ఏది ఏమైన తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజా వైఎస్ జగన్ సారధ్యంలో తనదైన రాజకీయ ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతుంది రోజా..