చంద్రబాబు చేసిన అప్పులను జగన్ తీర్చారన్నారు: అంబటి రాంబాబు

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన పదవి నుంచి దిగిపోయాక ముందు వేల కోట్లు బకాయిలు పెట్టారని.. ఆయన చేసిన అప్పులన్నీ వైయస్ జగన్ సీఎం అయ్యాక తీర్చారన్నారని అన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఎగ్గొట్టిన గొప్ప నేత చంద్రబాబు అని వెటకారం చేశారు.

ఢిల్లీలో సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తాం అంటూ మోసం చేశారు అని.. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించినవారు లేరు అని అన్నారు. ఆయన చేసిన నిర్వాకం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని.. ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.