పక్క రాష్ట్రాలకి వెళ్లాల్సిందేనా! జగన్ కి ఇక అదే దిక్కా ?

jagan battles with judiciary unprecedented

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే… న్యాయ, రాజకీయ వ్యవస్ధల్లోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీష్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలు చేశారు బాగానే ఉంది. మరి తన ఆరోపణలపై జగన్ ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారు ? జగన్ చేసిన ఆరోపణలపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే ఏ విధంగా స్పందిస్తారు ? అన్నది ఇక్కడ కీలకమైంది.

jagan battles with judiciary unprecedented
jagan mohana reddy file photo

ఓ టీవీ చర్చల్లో పాల్గొన్న కొందరు లాయర్ల అభిప్రాయం ప్రకారం రాష్ట్రానికి సంబందించిన కేసులను ఇక నుండి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దేనికైనా బదిలి చేయించాల్సుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కు సంబంధించిన అదాయానికి మించిన అక్రమాస్తుల కేసులను కర్నాటక హైకోర్టులో విచారించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తమిళనాడు హైకోర్టు విచారణపై తనకు నమ్మకం లేదని అప్పట్లో జయలలిత చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సుప్రింకోర్టు పై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒక రాష్ట్రంలోని కేసులను ఇతర రాష్ట్రాల్లో విచారించిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఉద్దేశ్యపూర్వకంగా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. అంటే హైకోర్టు విచారణపై తన నమ్మకం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. కాబట్టి ఇపుడు విచారణలు జరుగుతున్న కేసులను ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులకు బదిలీ చేయటంతో పాటు ఇక నుండి ఏ కేసును కూడా హై కోర్టులో విచారణ జరగకపోవటమే మంచిదని అభిప్రాయపడ్డారు.