గవర్నర్ రాజముద్రతో ఏపీలో మూడు రాజధానులు చట్ట రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి రూపం మార్చుకున్నాయి. పరిపాలనా రాజధానిలో ఈనెల 16 ఠెంకాయ కార్యక్రమాలు కొట్టి పాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ భావించినట్లు ప్రచారం సాగింది. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నట్లు..కుదిరితే డైరెక్ట్ గా విశాఖకు రావడం లేదంటే..జూమ్ యాప్ ద్వారా కార్యక్రమం జరగనుందని ప్రచారంలోకి వచ్చింది. అయితే హై కోర్టులో పంచాయతీ ఇంకా కొనసాగుతుండటంతో ఇప్పుడా ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో జగన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా ముహూర్తాన్ని విజయదశిమికి మార్చినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియదు. అయితే ముహూర్తాన్ని విజయదశికిమికి మారిస్తే మాత్రం మోదీ పీక మీద కత్తి పెట్టినట్లే ఉంటుంది. ఎందుకంటే అమరావతిని రాజధానిగా చేసినప్పు డు నేరుగా మోదీ చేతుల మీదుగానే శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. గంగా నది నీరు..మట్టి తీసుకొచ్చి ఇసుక..రాయి వేసి శంఖుస్థాపన చేసారు. ఇది అప్పటి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది.
మళ్లీ ఇప్పుడు మోదీ చేతుల మీదుగా రెండవ సారి ఏపీ రాజధాని శంఖుస్థాపన ఘట్టం అంటే? ఎలా ఉంటుందో ఊహకే వదిలేయాలి. రాజకీయ అంశాలు పక్కనబెట్టి ఆలోచిస్తే రెండవ రాజధాని..మళ్లీ ఏపీకి మోడీ శంఖు స్థాపనకు రావడం అనేది కామెడీగానే ఉంటుంది. తాజా పరిస్థితుల్లో అయితే మోదీ తప్పించుకునే అవకాశం ఉంది. కరోనా పేరు చెప్పో..బిజీగా ఉందనో! ఏదోలా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ విజయ దశిమి అంటే ఈలోపు కరోనా హడావుడి తగ్గుతుంది. దేశంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయి. జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ఆహ్వానించే అవకాశం ఉంది. ఆగస్టు 16న తమకి కుదరదనే ముహూర్తాన్ని దశిమికి మార్చామని చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాట కాదనలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.