Anchor Suma : క్యాష్ షో లో మొదటిసారి తన పేరు విన్న సుమ… ఆ దైర్యం ఎవరు చేశారో తెలుసా..?

Anchor Suma : ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూ తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సుమ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని బుల్లితెర మహారాణిగా పేరు పొందింది. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ, క్యాష్ వంటి షో లకి ఎన్నో ఏళ్లుగా యాంకరింకింగ్ చేస్తోంది. ఇలా టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో కూడా సుమ నిత్యం బిజీగా ఉంటోంది. ఒక స్టార్ హీరోయిన్ కన్నా సుమకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం సుమ న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో ప్రతివారం నలుగురు సెలబ్రిటీలు పాల్గొంటారు. ఈ షోలో సెలబ్రిటీలతో కలిసి సుమ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో జబర్దస్త్ కమెడియన్స్ వారి భార్యలతో కలిసి ఈ షోకి హాజరయ్యారు. ఈ షోలో ఆనంద్ – మంజుల, సత్తిపండు-నాగమాంబ, కొమరం- రజిత, శాంతి కుమార్ – సుమ జంటలు హాజరయ్యారు.

YouTube video player

ఈ షో లో సుమ వారికి ఫన్నీ టాస్క్ లు ఇచ్చి ఒక ఆట ఆడుకుంది. ఈ క్రమంలో అవకాశం వస్తే మీరు భర్తలను అమ్మెస్తార అని అడగగా..అందరు అమ్మము అని చెప్పారు. కానీ శాంతి కుమార్ మాత్రం ఛాన్స్ వస్తె అమ్మాలని చూస్తోంది, కానీ ఆ ఛాన్స్ రావటం లేదు అని అంటాడు. దీంతో అందరూ ఒక్కసారిగ నవ్వుతారు. తర్వత స్కిట్ లో భాగంగా అందరు తమ భార్యలతో సపర్యలు చేయించుకున్నారు. కొమరం తన భార్య కాళ్ళు పట్టటంతో సుమ గారి పుణ్యమా అని పెళ్లైన 15 సంవత్సరాలకు కాళ్ళు పట్టింది అని అంటాడు. ఇక ఆనంద్ తన భార్యకి భయపడి తానే అతని భార్యకి కాళ్ళూ పట్టాడు. ఇక శాంతి కుమార్ భార్యలతో సపర్యలు చేయించుకోవటం ఎలాగో నన్ను చూసి నేర్చుకోండి అంటూ బిల్డప్ ఇచ్చాడు. తన భార్యని పిలవడానికి గట్టిగా సుమా అని అరుస్తాడు. దీంతో సుమ నన్ను ఎవరూ పిలిచారా.. అని చూస్తే అప్పుడు శాంతి మిమ్మల్ని కాదు… నా భార్యని అని అంటాడు. అప్పుడు సుమ ఇంతవరకు ఈ సెట్ లో నన్ను పేరు పెట్టీ పిలిచే దైర్యం ఎవరు చేయలేదు అని అంటుంది.