Jabardasth Faima : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియనివారు అంటూ ఉండరు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈటీవీలో ప్రసారమయ్యి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న ఈ జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కామెడీ షో లో కమెడియన్లుగా మాత్రమే కాకుండా లవ్ అఫైర్ వల్ల కూడా చాలామంది పాపులర్ అయ్యారు. అటువంటి వారిలో సుధీర్, రష్మి జంట ఒకటి.
స్టేజి మీద వీళ్లిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ వల్ల ఆడియన్స్ అందరు నిజంగానే లవర్స్ అని కొంతకాలం అపోహ పడ్డారు. కానీ అది కేవలం స్క్రీన్ మీద మాత్రమే అని తర్వాత తెలిసింది. వీరిలాగే జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన జంటలలో ఇమన్యుల్, వర్ష జంట కూడ ఒకటి. వీరిద్దరు తరుచూ స్కిట్స్ చేయటం వల్ల వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపించాయి. అది కుడా కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అని తెలిసింది. వీరిలాగే మరొక జబర్దస్త్ జంట కూడా బాగా ఫేమస్ అయింది.
ఈ మధ్యకాలంలో జబర్దస్త్ స్టేజి మీద తన కామెడీ పంచులతో బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్
ఫైమా. ఈమె కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు ఎన్నో షోస్ లో చెప్పుకొచ్చారు. ప్రవీణ్ కూడ ఫైమాను ప్రేమిస్తున్నట్టు, తను అవకాశం ఇస్తే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పలు కార్యక్రమాలలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో పైమా నవ్వుతూ మౌనంగా ఉండటంతో వారి ప్రేమ నిజమైనదే అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల వీరిద్దరి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇటీవల జరిగిన ఒక ఎపిసోడ్ లో ప్రవీణ్ ప్రేమ పేరుతో మూడు సంవత్సరాలు ఈమె వెంట తిరిగితే చివరకు వదిలేసింది అంటూ డైలాగ్ చెప్పాడు. పైగా కొంతకాలంగా వీరిద్దరూ కలిసి స్కిట్ చేయకపోవడం వల్ల వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరిద్దరి మతాలు వేరు అయినందువల్ల తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.