బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమంతో ఎంతో మంది కమెడీయన్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఒకప్పుడు పూట గడవడమే వారికి ఇబ్బందిగా ఉండేది అలాంటిది ఇప్పుడు జబర్ధస్త్ పుణ్యానా కొత్త ఇళ్లు, కొత్త కార్లు కొంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కొందరేమో తమ అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. అయితే జబర్ధస్త్ నటులకు రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది, ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయాలు మాత్రం కాస్త సీక్రెట్‌గానే ఉండేవి. తాజాగా వీటిపై కొంత సమాచారం బయటకు వచ్చింది.
ఒకప్పుడు టీంలో సభ్యుడిగా ఉన్న అప్పారావు లీడర్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అతను పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. జబర్ధస్త్ పుణ్యానా మంచిగానే సంపాదించాను. పేరు కూడా బాగానే వచ్చింది. పలు ఈవెంట్స్ వస్తున్నాయి. ఈవెంట్‌ను బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నాను. బయట ఈవెంట్స్ కు వెళితే ఓ రోజు డే అంతా వేస్ట్ అవుతుంది, కాబట్టి దానికి కూడా కొంత వసూలు చేయాల్సి వస్తుందని అన్నాడు అప్పారావు. భాస్కర్‌తో కలిసి టీం లీడర్‌గా పని చేస్తున్న అప్పారావు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ తీసుకొచ్చింది .
లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటాడని సమాచారం అందుతుండగా, ఇతని కన్నా సుడిగాలి సుధీర్, హైపర్ ఆదీలు ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటారని అప్పారావు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జబర్ధస్త్ షోతో పాటు అడపాదడపా ఇతర టీవీ ఛానెల్స్‌లో తన సతీమణితో కలిసి పలు షోలలో పాల్గొంటున్నాడు. వదిన అనే పదం ఎక్కువగా వాడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన అప్పారావు చాలా ఫేమస్ అయ్యాడు. లాక్‌డౌన్ వలన దాదాపు 9 నెలలు ఇంటికే పరిమితమైన ఇతను ఇప్పుడు షూటింగ్స్‌తో బిజీబిజీగా మారాడు.