ఆ ఎమోషన్స్ అన్నీ ఫేక్ కాదు.. అన్ని వాస్తవాలే జబర్దస్త్ గురించి వర్ష షాకింగ్ కామెంట్స్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై వారి టాలెంట్ తో ఏకంగా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇమ్మానియేల్, వర్ష జంట ఒకటి. ఈ విధంగా ఇమ్మానియేల్ తో కలిసి వర్ష స్కిట్లు చేయడంతో ఎంతో మంది వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్స్ లేవని క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం కావడానికి ముందు ఎన్నో రకాల ప్రోమోలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ ప్రోమో చూస్తే ఎపిసోడ్ పై విపరీతమైన అంచనాలు పెరుగుతాయి. ఎన్నో ఎమోషన్స్ తో కూడిన ఈ ప్రోమోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు కొన్ని సంఘటనల గురించి తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా కేవలం రేటింగ్స్ కోసమే అంటూ చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్ష మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని సార్లు భావోద్వేగం అవుతూ ఉంటారు. అయితే అవన్నీ కూడా వాస్తవాలని, వాటిలో ఏ విధమైనటువంటి ఫేక్ ఉండదని ఈమె తెలిపారు. ఇకపోతే తనకు సినిమాల్లో నటించడం కన్నా ఇలా బుల్లితెర కార్యక్రమాల్లో నటించడమే చాలా సంతోషంగా ఉందని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపారు. తాను బయట ఎక్కడ కనిపించినా అందరూ కూడా తనని జబర్దస్త్ వర్ష అని పిలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా వర్ష వెల్లడించారు.