జబర్దస్త్ షో బూతు షో… జబర్దస్త్ కార్యక్రమం గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

బుల్లితెరపై అత్యధిక రేటింగ్ సంపాదించుకొని బుల్లితెర కార్యక్రమాల్లో నెంబర్ వన్ కార్యక్రమంగా కొనసాగుతున్నటువంటి కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముందుకు కొనసాగుతూ అద్భుతమైన రేటింగ్ సంపాదించుకుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాఖ్యల పై ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జబర్దస్త్ కార్యక్రమం ఒక బూతు షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి బూతు కార్యక్రమాలను ఈ టీవీలో ప్రసారం చేయడం రామోజీ రావు గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకానొక సందర్భంలో ఈ టీవీ రేటింగ్ విషయంలో టాప్ టెన్ కు చేరింది.ఈ క్రమంలోని ఈ టీవీని నిలబెట్టడం కోసం తనకు ఇష్టం లేకపోయినా జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఈ టీవీ పదవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈ టీవీ రేటింగ్స్ అద్భుతంగా ఉండడంతో రామోజీ రావు గారు తనకు ఇష్టం లేకపోయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక పెద్ద బూతు షో అని ఇలాంటి షోలను చూడాలంటే తనకు ఏమాత్రం నచ్చదని తెలిపారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ మాట్లాడే బూతు మాటలకు జడ్జిలు వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటారని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం గీతాకృష్ణ జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.