Patas Praveen – Faima: బుల్లితెర పై ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా పరిచయమైన ప్రవీణ్, ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం తరువాత వీరిద్దరూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ తమదైన శైలిలో తన కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఫైమా పటాస్ ప్రవీణ్ మధ్య ప్రేమ యానం సాగుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవడంతో ఎంతోమంది ఈ విషయంపై వీరిని ప్రశ్నించారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న అడగడంతో ఫైమా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పటాస్ ప్రవీణ్ తనకు మధ్య ఉన్న సంబంధం గురించి బయట పెట్టారు. ప్రవీణ్ గత నాలుగు సంవత్సరాల నుంచి తనని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని తెలిపిన ఈమె తను మాత్రం ప్రవీణ్ ను ఇష్టపడుతున్నానని తెలిపారు.
అయితే ఈ ఇష్టం ఎప్పుడైతే ప్రేమగా మారుతుందో అప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తానని ఈ సందర్భంగా ఫైమా పటాస్ ప్రవీణ్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే కరోనా వచ్చిన సమయంలో చాలామంది ఈ వ్యాధి గురించి భయపడ్డారు. కానీ నేను కరోనా బారిన పడినప్పుడు ప్రవీణ్ తనకు దగ్గరుండి ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఫైమా ఎమోషనల్ అయ్యారు.