త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న జబర్ధస్త్ కమెడియన్.. ఎవరంటే?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో టాప్ రేటింగ్ తో నెంబర్ 1 స్థానం దక్కించుకున్న షో జబర్ధస్త్. ప్రేక్షకుల్లో జబర్ధస్త్ కి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ ల మధ్య లవ్ ట్రాక్ ల వల్లా బాగా పాపులర్ అయ్యింది. సుధీర్, రష్మి మద్య ట్రాక్ తో మొదలైన ఈ వ్యవహారంలో ఎన్నో జంటలు వచ్చి చేరాయి. సుధీర్ రష్మీ, వర్ష ఇమాన్యుల్ వంటి జంటలను రేటింగ్స్ కోసమే వాడుకున్న ఈటీవి కొంతమంది నిజమైన ప్రేమ జంటలను కూడా పాపులర్ చేసింది. అటువంటి జంటల్లో నూకరాజు – ఆసియా జంట కూడా ఒకటి. నూకరాజు మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న పటాస్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించి పాపులర్ అయ్యాడు.

ఈ షోలో పార్టిసిపేట్ చేసిన మరొక లేడీ కంటెస్టెంట్ ఆసియా తో నూకరాజు కి స్నేహ బంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం కొంతకాలానికి ప్రేమగా మారింది. పటాస్ షో ద్వారా పాపులర్ అయిన ఈ జంట జబర్దస్త్ లో కూడా కనిపించింది. పటాస్ షో ద్వారా పాపులర్ అవటంతో నూకరాజుకి జబర్ధస్త్ లో అవకాశం కల్పించారు. జబర్ధస్త్ స్టేజ్ మీద వీరిద్దరి ప్రేమ విషయం రివీల్ చేశారు. అయితే మిగిలిన జంటల లాగా టీఆర్పీ కోసమే ఇలా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కానీ వీరిద్దరు నిజంగానే ప్రేమించుకున్నారు. స్నేహం ద్వారా మొదలైన వీరు పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది.

అయితే చాలా రోజులుగా వీరిద్దరు ఇటు బుల్లితెర మీద కానీ, సోషల్ మీడియాలో కానీ జంటగా కనిపించలేదు. దీంతో వీళ్ళు కూడా సుధీర్,రష్మి లాగా ప్రేక్షకులని ఆలరించటానికి అలా చేశారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరిది నిజమైన ప్రేమ అని ఇటీవల విడుదలైన శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా నిరూపణ అయ్యింది. ఎట్టకేలకు వారిద్దరి ప్రేమకు సంబంధించిన క్లారిటీ వచ్చే వారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో క్లారిటీ రాబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆసియా కన్నీళ్లు పెట్టుకుంటే నూకరాజు ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. దీంతో నూకరాజు, ఆసియా మధ్య నిజమైన ప్రేమ ఉందా అంటు ప్రేక్షకులు అనుమాన పడుతున్నారు . దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.