యాంకర్ అనసూయను చంపేస్తానంటున్న జబర్దస్త్ కమెడియన్…!

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర యాంకర్లలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. అటు వెండితెరని, ఇటు బుల్లితెరని తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ తో తన అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది ఈ హాట్ యాంకర్. అయితే ఇప్పుడు అనసూయని చంపేస్తా.. పొడిచేస్తా అంటూ జబర్ధస్త కమెడియన్ వీరంగం సృష్టించాడు. వామ్మో అంటూ అనసూయ భరద్వాజ్ తెగ టెన్షన్ పడుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది. అప్పుడుప్పుడు అనుకోని విధంగా లైఫ్ లో స్టోరీ రివర్స్ అవుతుంటుంది. అలాంటిదే జబర్దస్త్ సెట్లోనూ జరిగింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు జబర్దస్త్ టీమ్. అటు జబర్దస్త్ కంటెస్టెంట్స్ ని.. ఇటు ఢీ టీమ్ ని ఒకే స్టేజ్ పై పెట్టి ఈవెంట్ ప్లాన్ చేశారు.

అద్భుతమైన కాన్సెప్ట్స్ తో రెండు టీమ్ లు అద్దరగొడుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ సీనియర్ కమెడియన్ రాకెట్ రాఘవ న్యూ ఇయర్ స్కిట్ చేశారు. అందులో మందుబాబు పాత్రలో రాఘవ జీవించేశారు. స్క్రిప్టులో భాగంగానే తన స్కిట్ వచ్చేటప్పుడు.. ఎవరి యాక్షన్ ఎలా ఉంటుందో చేసి చూపించాడు రాఘవ. అందులో రోజా పేరు రాగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయి.. చివరకు దండం పెట్టేశారు. యాంకర్ అనసూయ పేరు వినపడగానే మందు బాటిల్ పట్టుకుని చంపేస్తానంటూ భీభత్సం సృష్టించాడు. దాంతో అనసూయ ఏంటి నేనేం చేసానని అడిగితే.. తాను చేసిన స్కిట్స్ కి అస్సలు నవ్వకుండా కూర్చుంటుందేంటండి అంటూ అరిచేశాడు రాఘవ.

దాంతో తెగ భయపడిన అనసూయ తాను అందరి స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చింది. అదీ సంగతి. ఎప్పుడూ ఫన్నీగా ఎంటర్ టైన్ చేసే రాఘవ అనసూయపై ఇలాంటి పంచులు వేయడంతో స్కిట్ కి ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ప్రజంట్ ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది.