Comedian Apparao: ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిన జబర్దస్త్ అప్పారావు?

Comedian Apparao: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి గురు శుక్రవారాలలో ఈ షో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఇకపోతే షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ కు పరిచయమైన విషయం అందరికి తెలిసిందే. వారిలో జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా ఒకరు. ఇతను జబర్దస్త్ చేంజ్ పై తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చారు. ముఖ్యంగా తన గెటప్ లతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.

ఇదిలా ఉంటే తాజాగా అప్పారావు ఏపీ ప్రభుత్వాన్ని విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా ఈ నిరసనలో పాల్గొన్నాడు. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశాడు అప్పారావు. చింతామణి నాటకం పై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఆ నాట‌కానికి గొప్ప చ‌రిత్ర ఉంద‌ని, 1920లో ఆ నాట‌కాన్ని మహాకవి కాళ్ల‌కూరి నారాయణరావు రాశారని అప్పారావు తెలిపారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ఇప్పుడు ఆ నాట‌కంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం స‌రికాద‌ని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాలని అప్పారావు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మరి అప్పారావు కోరిక మేరకు జగన్ ఆ విషయాన్ని పట్టించుకుంటాడా లేదా అన్నది చూడాలి మరి.