J.C. Pawan: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్లను పట్టించుకోవటం లేదని వారికి కల్పించాల్సిన స్థానాలు వారికి ఇవ్వటం లేదు అంటూ కొంతమంది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కోసం తమ సీట్లను కూడా వదులుకోవాల్సి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటికి తమని గుర్తించలేదంటూ కొంతమంది ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారడానికి కూడా సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారిలో జేసీ పవన్ కూడా ఒకరు తాడిపత్రిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జేసీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు కానీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపీగా టికెట్ ఇవ్వలేదు.
గత ఎన్నికలలో ఈయన అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి కూటమి పొత్తులో భాగంగా టికెట్ కూడా రాకపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సింగనమల మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అటే ముందుగా జేసీ పవన్ ను కలిశారు దీంతో శైలజనాథ్ బాటలోనే పవన్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలపై జేసీ పవన్ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానని వార్తలు వస్తున్నాయి అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. శైలజ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు అలా నిర్ణయం తీసుకున్న వారిని మనం ఏం చేయలేము అందుకే తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించానని వెల్లడించారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈయన ఈ వార్తలను ఖండించారు.
