Shiva Rajkumar: దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ గురించి మనందరికీ తెలిసిందే. గత ఏడాది అనూహ్యంగా మరణించిన విషయం అందరికీ తెలిసింది. పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు లేరు అన్న వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా పునీత్ అన్న శివ రాజ్ కుమార్ పునీత్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. పునీత్ రాజ్ కుమార్ పాత్రకు జేమ్స్ సినిమాలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైంది అని శివరాజ్ కుమార్ తెలిపారు.
డబ్బింగ్ చెప్పే సమయంలో స్క్రీన్ మీద పునీత్ ని చూస్తుంటే తనకు మానసికంగా చాలా కష్టంగా అనిపించింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు శివ రాజ్ కుమార్. ఇక సినిమా మధ్యలోనే పునీత్ అకాల మరణం చెందడం తో ఆ పాత్రకు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ని సంపాదించుకొని పవర్ స్టార్ గా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. కన్నడ పవర్ స్టార్ పునీత్ మారడానికి గల కారణం అతని జీవితం క్రమశిక్షణతో సాగింది. అంతేకాకుండా పునీత్ కన్నడ సినీ ఇండస్ట్రీలో డాన్సులను, ఫైట్స్ లను ఒక స్థాయికి తీసుకెళ్లిన ఘనత పునీత్ రాజకుమార్ కి దక్కింది.
అలాగే కన్నడ సినీ పరిశ్రమలో ఈ జనరేషన్ హీరోలలో పునీత్ కు ఉన్న రికార్డ్స్ మరే హీరోకి లేవు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పునీత్ నటించిన అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ లాంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీలో గొప్ప సినిమాలుగా నిలిచిపోయాయి. ఇక పునీత్ కి తెలుగు ఇండస్ట్రీలో నటీనటులు, అదేవిధంగా టెక్నీషియన్ లు అన్నా ఎంతో గౌరవం. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ను తన సొంత తమ్ముడిలా ఫీలయ్యేవాడు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాల నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.