ప్రేక్షకులతో అలా అనిపించుకోవడం కంటే వదిలేయడం బెటర్..ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

అలనాటి ప్రముఖ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన ఇంద్రజ వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. కొంతకాలం తర్వాత మళ్లీ ఇండస్ట్రీ కెరీ ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ సినిమాలు చేస్తూ బుల్లితెర మీద ప్రసారమై టీవీ షోలకు గెస్ట్ జడ్జి గా సందడి చేసేది. రోజా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జబర్దస్త్ లో కొన్ని వారాలపాటు జడ్జిగా చేసిన ఇంద్రజ తన నవ్వుతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పర్మినెంట్ జడ్జిగా కొంతకాలం వ్యవహరించింది. మంత్రి పదవి తగ్గటంతో రోజా జబర్దస్త్ కి దూరమైంది. ఈ క్రమంలో జబర్దస్త్ లో జడ్జిగా రోజే స్థానం భర్తీ చేయటానికి ఇంద్రజ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోస్ కి పర్మినెంట్ జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇంద్రజ స్ధానంలో శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో పూర్ణ జడ్జ్ గా కొనసాగుతోంది. అయితే ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుండి బయటకు రావడానికి సుదీర్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుండి వెళ్లిపోవడం వల్ల ఇంద్రజ కూడా ఆ షోకి దూరంగా ఉంది అంటూ సమాచారం. ఇదిలా ఉండగా ఇంద్రజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుండి బయటికి రావడానికి గల కారణమైన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ.. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో జడ్జ్ గా చేస్తున్నాను.. ఇంకా శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తే ప్రేక్షకులకి బోర్ కొడుతుంది. అన్నిచోట్లా ఆమే కనిపిస్తోంది అంటూ ప్రేక్షకులు ఛీ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రేక్షకులతో చీచీ అనిపించుకోవడం కంటే ముందే వదిలేయడం బెటర్.. వారికి కూడా కొత్తదనం కావాలి కదా?.. అంటూ ఇంద్రజ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.