జగన్ సర్కార్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డని ఇంటికి పంపింపాచలని ప్రభుత్వం భావిస్తుంటే…కాదు ఆ సీటు నాదేనంటూ ఆయనే అంతే పట్టుబడి ఉన్నారు. ఈ వ్యవహారంలో ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. ఎవరికి వారు రైట్ అనుకుంటున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఇది రాజ్యంగబద్దమైన విషయం కావడంతో కోర్టుల ద్వారా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంలో పిల్ వేయడానికి రెడీ అవుతుంది.
ఇది ప్రభుత్వానికి ఉన్న హక్కు. ఇక నిమ్మగడ్డ తానే రైట్ అంటూ తన వివరణను అంతే క్లారిటీగా ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఢీకొట్టి ఆయన రాజ్యంగపరమైన పోరాటానికి సై అంటే సై అంటున్నారు. ఫైనల్ గా ఈ వ్యవహారంలో తేల్చుకోలవాల్సింది నిమ్మగడ్డ… ప్రభుత్వం …కోర్టులు మాత్రమే. మధ్యలో ఏ రాజకీయ పార్టీనో…ప్రతిపక్షమో యాగీ చేయడానికి అవకాశం లేదు. కానీ టీడీపీ నేతలు…జనసేన నేతలు…సీపీఐ నేతలు వాళ్లు పనులు మానుకుని మరీ ఈ వ్యవహారంలో తలపెట్టడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయంలో మాత్రం రాజకీయ పార్టీ జోక్యం ఏమాత్రం సేహేతుకం కాదు. హైకోర్టు తీర్పునిచ్చినా కూడా రాజకీయ పార్టీలు ఎందుకు యాగీ చేస్తున్నాయో అర్ధం కాలేదన్న విమర్శలొస్తున్నాయి.
నిమ్మగడ్డ తీరుపై ఏజీ శ్రీరాం క్లారిటీ ఇచ్చినా..అది కూడా దుసంప్రదాయం అని ప్రచారం చేస్తున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే కందకు లేని దురక కత్తికెందుకు? అన్నట్లే ఉంది. అసలు ఎన్నికలు కమీషనర్ ఎవరైతే ఏంటి? రాష్ర్టంలో సజావుగా ఎన్నికలు జరగాలి. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి. కానీ ప్రతిపక్షాలు నిమ్మగడ్డే ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలనడమే పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారని ప్రచారం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిమ్మగడ్డను నియమించిన సంగతి తెలిసిందే.