2019 ఎన్నికల్లో విజయమని సాధించి, అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇంకా అనుభవ లోపాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ రెడ్డి పాలనలో ఇంకా తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అనుభవ లోపాన్ని టీడీపీ నాయకులు సరిగ్గా వాడుకుంటున్నారు. టీడీపీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్డ్ ను ప్లే చేసే అధికారంలోకి వచ్చారో అలాగే ఇప్పుడు టీడీపీ కూడా విక్టిమ్ కార్డ్ ను ప్లే చేస్తున్నారు. జగన్ చేసే ప్రతి పనిని టీడీపీ నాయకులు సరిగా వాడుకుంటూ ప్రజల దగ్గర నుండి ఆదరణను పొందుతున్నారు. జగన్ తనకు తెలియకుండానే టీడీపీ నాయకులను హీరోలను చేస్తున్నారు.
అచ్చెన్నను హీరోను చేసిన జగన్
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను ఎలాంటి ఇబ్బందులను గ్రూప్ చేశారో అందరికి తెలుసు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులపై కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఈ కక్ష్యపూరిత రాజకీయాలు చెయ్యడం వల్ల టీడీపీ నాయకులు హీరోలుగా మారుతున్నారు. ఏపీలో అచ్చెన్నాయుడుని కేవలం ఎనిమిది నెలల తేడాలో రెండు సార్లు వైసీపీ సర్కార్ అరెస్ట్ చేసింది. అంతే కాదు, ఈ మధ్యనే సంతబొమ్మాళి నంది విగ్రహం కేసులో కూడా అచ్చెన్నాయుడుకి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. ఇపుడు ఒక్కసారిగా అచ్చెన్నాయుడు హీరో అయిపోయాడు. ఆయన తొలిసారి అరెస్ట్ అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇలా అచ్చెన్నను జగన్ రెడ్డి హీరోగా చేశారు.
టీడీపీ ట్రాప్ లో జగన్ పడ్డాడా!!
వైసీపీ నాయకులను రెచ్చకొట్టి ప్రజల నుండి సింపతీ పొందటానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహంలో జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు వాళ్లకు తెలియకుండానే పడుతున్నారు. రెచ్చిపోయిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను అరెస్ట్ చెయ్యడం వల్లే టీడీపీ నాయకులు హీరోలు అవుతున్నారు. టీడీపీ నాయకులు హీరోలు అవుతున్నారని వైసీపీ నాయకులకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీడీపీ రాష్ట్రంలో మళ్ళీ బలపడింది. ఇలా జగన్ రెడ్డి తనకు తెలియకుండానే టీడీపీ ట్రాప్ లో పడుతున్నారు.