చంద్రబాబు చివరాఖరి ‘ హోప్ ‘ ఇదే .. ఇది కూడా జగన్ తొక్కబోతున్నాడు ??

YS Jagan should repair CBN's damages to education system 

ఏపీలో టీడీపీ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ అందరికి తెలుసు. ఎన్నికల్లో వైసీపీ నాయకులు కొట్టిన దెబ్బకు టీడీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఇంకా కొలుకోలేదు. పార్టీ దాదాపు తెలంగాణలో లాగా పతనంకు చేరువలో ఉంది. నిరుత్సాహంలో ఉన్న పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సహం నింపడానికి పార్టీ యొక్క నాయకత్వాన్ని కూడా మార్చడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ ఇంత పతన స్థాయికి చేరుకున్నా కూడా చంద్రబాబు నాయుడుతో మాత్రం ఎలాంటి భయం లేదు, పైగా ఇంకా ధీమాగా కనిపిస్తున్నారు. ఈ ధీమాకు గల కారణాలు ఏంటని వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.
Nara Chandra Babu Naidu
బాబు పొత్తుల రాజకీయం

చంద్రబాబులో కనిపిస్తున్న ధీమాకు కారణం ప్రాంతీయ పార్టీలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా గట్టుకొని 2024 ఎన్నికల్లో జగన్ ఓడించడానికి పతకం రచిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే బీజేపీకి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు . అవకాశం దొరికిన ప్రతిసారి ప్రధాని మోదీని పొగుడుతున్నారు. అలాగే సీపీఐ, సీపీఎం,కాంగ్రెస్ లతో కూడా జత కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. బీజేపీకి దగ్గరైతే ఎలాగో జనసేన కూడా కలిసి రావాల్సిందే. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా ఒంటరిగా గెలవలేదు. అందుకే 2024లో కూడా పొత్తులు పెట్టుకొని గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పొత్తుల రాజకీయ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

చంద్రబాబుకు జగన్ లొంగుతాడా!

చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పొత్తుల రాజకీయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కుంటారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జగన్ కూడా రానున్న రోజుల్లో టీడీపీని ఎదురించడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తమ నాయకుడు పొత్తులు పెట్టుకోకుండానే గెలిచేంత ధైర్యం ఉందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అలాగే అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడును దెబ్బతియ్యడానికి పతకాలు జగన్ రచించారని, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను ఇప్పుడు బయటకు తీసి ఇబ్బందులకు గురి చేయనున్నాడని టాక్.