సహజంగా మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే మీ శరీరం ఎక్కువ వేడికి గురైనట్లు తెలుస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం ఉష్ణోగ్రతను తనంతట తానే క్రమబద్ధం చేసుకుంటుంది. వేడి వల్ల అనారోగ్యం రాకుండా సమతుల్యం చేసుకుంటుంది. బహిర్గతంగానూ ఇంకా అంతర్గతంగాను ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన శరీరం వేడి చేసింది అని తెలుసుకోవాలి.
దీని లక్షణాలైనా ఎండలో కాసేపు నిలబడితే అలసట రావడం, ఉదయం సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు అలసటగా ఉండటం, వాంతులు,
విరోచనాలు కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి ఇబ్బందికరంగా ఉంటుంది. మీ శరీరానికి ఎక్కువ వేడి చేయడం చాలా ప్రమాదకరం అది గుండెకు ఇంకా మెదడుకు హాని కలిగిస్తుంది. దీనివల్ల గుండె డిహైడ్రేషన్ గురికావడం జరుగుతుంది. మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.
ఎండాకాలంలో అయితే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీర వేడిని తగ్గించుకోవడానికి పుచ్చకాయలు తీసుకోవడం ద్వారా దీనిలో నీరు ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కర్బూజా ను వేసవికాలంలో రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా శరీరం వేడికి గురి కాకుండా ఉంటుంది. కీర దోసకాయ లో నీటి శాతం ఎక్కువ కావున శరీర వేడిని తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. పుదీనా ను జ్యూస్ లాగా చేసుకుని తాగడం ద్వారా శరీరవేడిని బాగా తగ్గిస్తుంది.
ఎర్ర ముల్లంగి లో నీటి శాతం ఎక్కువ ఇంకా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీర వేడి తొందరగా తగ్గిస్తాయి. నువ్వులను రాత్రంతా నానబెట్టి ఉదయం వడగట్టి ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెద్ద జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల ఇది కూడా శరీర వేడిని తగ్గించే మంచి చిట్కా. దానిమ్మ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాసు త్రాగడం వల్ల శరీరం వేడికి గురికాకుండా ఉంటుంది. గసగసాలు ఒక గుప్పెడు రాత్రి పడుకునే ముందు కొంత నీటితో తీసుకోవడం ద్వారా నిద్ర బాగా పడుతుంది ఇంకా శరీర వేడిని తగ్గిస్తుంది. ఈ చిట్కాలను పాటించి శరీరంను వేడికి గురికాకుండా చూసుకోవాలి.