తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్టార్ క్యాంపెనర్ విజయశాంతి, ఎక్కడ ఎన్నికల జరిగిన ఆమెను ప్రచారంలోకి దించేవాళ్ళు కాంగ్రెస్ నేతలు, 2018 ఎన్నికల సమయంలో కావచ్చు,2019 ఎన్నికల సమయంలో కావచ్చు, ఆమె సేవలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన హెలికాఫ్టర్ కేటాయించి మరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, అయితే అనుకున్న స్థాయిలో అది సక్సెస్ కాలేదు, కాంగ్రెస్ గెలవలేదు.
నిజానికి 2018 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేసులో విజయశాంతి వున్నారు, అయితే అన్యుహంగా ఆమెకు కనీసం అసెంబ్లీ టిక్కెట్ కూడా ఇవ్వకుండా కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. దీనితో ఆమె లో అసంతృప్తి ఛాయలు కనిపించాయి. ఎన్నికల అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది, ఆమెలో అసంతృప్తిని గమనించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలు ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చిన కానీ ఆమె మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక తాజాగా జరుగుతున్నా దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా విజయశాంతిని కేవలం షో పీస్ గానే వాడుకుంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి, ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నాయో అప్పుడే తాను కాంగ్రెస్ గుర్తుకు వస్తున్నాని లేకపోతె తనను ఎవరు పట్టించుకోవటం లేదని విజయశాంతి తన సన్నిహితుల వద్ద చెప్పి బాధపడినట్లు తెలుస్తుంది, ఇలాంటి సమయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి ఆమెను బీజేపీ లోకి రావాల్సిందిగా కోరటం, అందుకు ఆమె సుముఖం వ్యక్తం చేసినట్లు వార్తాలు వస్తున్నాయి.
నిజానికి విజయశాంతి బీజేపీ పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టింది, ఆ తర్వాత తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించి కొద్దీ రోజుల్లునే కేసీఆర్ సమక్షములో తెరాస లో విలీనం చేసింది, కానీ అక్కడ కేసీఆర్ తో పొసగకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఇప్పుడు కాంగ్రెస్ నుండి మళ్ళి బీజేపీ లోకి వెళ్ళటం జరిగితే, ఎక్కడైతే తన రాజకీయం జీవితం మొదలైందో మళ్ళి అక్కడికే విజయశాంతి వెళ్లినట్లు అవుతుంది, ఇక విజయశాంతి కాంగ్రెస్ కు దూరం అయితే ఒక స్టార్ క్యాంపెనర్ దూరం అయ్యినట్లే లెక్క, ఆమెను భర్తీ చేసే నాయకురాలు రాష్ట్ర కాంగ్రెస్ లో లేరనే చెప్పాలి. ఇప్పటికే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ నుండి సినీ గ్లామర్ కు సంబంధించిన కుష్బూ, నగ్మా లాంటి వాళ్ళు వెళ్లిపోయారు, ఇప్పుడు విజయశాంతి కూడా అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు