గంటా శ్రీనివాసరావు రాజీనామా వెనక ఇంత కథ ఉందా..?

ganta srinivas rao mla

 రాజకీయాల్లో సమయం అనేది చాలా ముఖ్యమైన విషయం. రాజకీయ నాయకుడు అనే వాడు ఎప్పుడు ఎలాంటి పని చేస్తే తనకు కలిసొస్తుందో బాగా ఆలోచింది సరైన నిర్ణయం తీసుకోవాలి, ప్రస్తుతం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అదే పనిలో ఉన్నాడు. రెండేళ్ల పాటు రాజకీయంగా ఎలాంటి ఉనికిని చాటుకోవడానికి పెద్దగా ఇష్టపడని ఈ మాజీ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం తెర మీదకు రావటం విశేషం. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు.

ganta srinivas rao mla

 

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆయన నినదించడమే కాదు, విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఎందాకైనా అంటూ గట్టిగానే గర్జించారు. అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని కూడా గంటా శ్రీనివాసరావు గంభీరమైన ప్రకటనే చేశారు. గంటాశ్రీనివాసరావు అన్నంత పనిచేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ వాసుల గుండె చప్పుడు అయిన ఉక్కు పరిశ్రమను పరాయి వాళ్లకు కట్టబెడతారా అంటూ ఆగ్రహిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ పేరు మీదనే ఉక్కు నగరం అని కూడా ఏర్పడింది ఆయన అంటున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కోసం తాను ముందుకు వస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అంతా చేతులు కలపాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇందుకు నాన్ పొలిటికల్ జేఏసీ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

 గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి గమనిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంతకైనా ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నాడు. చాలా రోజులుగా రాజకీయ ఉనికిని కోల్పోతున్న గంటా ఈ ఒక్క విషయంతో మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక ఇదే ఊపు కొనసాగించి తన రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతాడేమో అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాజీనామా చేసి విశాఖ వాసుల దృష్టిలో హీరో అయ్యిపోయాడు గంటా.

 తన రాజకీయ భవిష్యత్తు కంటే కూడా విశాఖ అభివృద్దే ముఖ్యమని రాజీనామా ద్వారా తెలియచేశాడు . మరికొద్ది రోజుల్లో గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరగబోతున్నాయి. సహజంగానే ఆ ఎన్నికల్లో గంటా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాజీనామా ఎపిసోడ్ తో గ్రేటర్ విశాఖలో గంటా శ్రీనివాసరావు ఫాలోయింగ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. మరి విశాఖ ప్లాంట్ విషయంలో చివరిదాకా గంటా ఇదే ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాడో లేదో చూడాలి