కేంద్రంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోతుంది. ఇక్కడున్న ప్రాంతీయ పార్టీల మీద గట్టిపోటీ ఇద్దామని ప్రయత్నిస్తున్నా లోపం ఎక్కడుందో కానీ చతికిల పడిపోతుంది.. ఇందుకు గాను బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావూ.. ఇకపోతే ఏపీలో బలపడడానికి వైసీపి తోడు కోసం వైఎస్ జగన్‌తో సఖ్యతగా ఉంటున్నారు బీజేపీ పెద్దలు.. కానీ తెలంగాణాలో కేసీయార్ మాత్రం ఆ చాన్స్ ఇవ్వడం లేదట.. ఇదిలా ఉండగా ఎన్డీయే కొత్త భాగస్వాముల కోసం వెతుక్కుంటుదట, ఈ మధ్య వైసీపీ అధినేత జగన్, అమిత్ షాతో చర్చలు జరిపాక, ఎన్డీయేలోకి రావచ్చు అంటున్నాడు. ఇప్పటికిప్పుడు జగన్‌ను చేర్చుకోవల్సిన అవసరం బీజేపీకి ఉందా అంటే లోగుట్టు ఎవరికి తెలుసు అంటున్నారు..
ఇకపోతే రాజకీయంగా జగన్‌కు బీజేపీ అవసరం లేదు.. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి తన కేసుల విషయంలో ఆ పార్టీతో తనకు సఖ్యత అవసరం.. కాబట్టి బయటి నుంచి మద్దతు వరకూ ఓకే గానీ, ఎన్డీయేలో అధికారికంగా చేరితే తనకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు దూరం అవుతారనే సందేహం జగన్‌లో ఉందేదట.. ఇదే కాకుండా ప్రస్తుత పరిస్దితుల్లో వైసీపీ వంటి కొత్త పార్టనర్స్ ఎన్డీయేకు అవసరమట.. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశాన్ని తొక్కితేనే, అలా ఏర్పడే స్పేసులోకి తను జొరబడొచ్చు అనే ప్లాన్‌లో బీజేపీ ఉందట..
ఇక కేంద్ర కేబినెట్‌లో సాయిరెడ్డి, బాలశౌరి, సురేష్‌లను తీసుకుంటారనే చర్చ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది.. కానీ బీజేపీ, వైసీపీ పార్టీలు ఎటూ తేల్చుకోలేని స్దితిలో ఉన్నాయట. ఇలాంటి పరిస్దితులు కలిగిన ఏపీ రాజకీయాల్లో, ఇప్పటికీ ఏపీకి సంబంధించి బీజేపీకి అసలు ఓ ప్లానంటూ ఉందా.. తన దిశ, దశ ఏమిటో తనకైనా క్లారిటీ ఉందా.. ఏపీ పాలిటిక్స్‌లో మార్పులపై సీరియస్‌గా ఉందా అనే సమాధానం లేని ప్రశ్నలు తలెత్తుతున్నాయట.. ఇక ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఒక గట్టి నిర్ణయానికి వస్తే గానీ బీజేపికి ఏపీలో పట్టు దొరకదు.. రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలిపోతుందంటున్నారు విశ్లేషకులు..