డెఫినెట్ గా ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుల పేర్లు తీస్తే అందులో ఉండే ఖచ్చితమైన పేరు శంకర్. తన విజనరీ డైరెక్షన్ తో అన్ని ఇండస్ట్రీలలో కూడా తన ముద్ర వేశారు. మరి అలాంటి శంకర్ కి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత మూడు నాలుగు నెలలుగా శంకర్ వాటిని క్లియర్ చేసే పనిలోనే ఉన్నారు.
అయితే కోలీవుడ్ కి చెందిన లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ “భారతీయుడు 2” చేసి ఆపేసిన సంగతి తెలిసిందే. దీనితో వారు కోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. తర్వాత వారు శంకర్ సినిమాలు ఆపేస్తామని చెయ్యనివ్వం అని కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ సమస్యకు న్యాయ స్థానంలో కాకుండా బయట ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది.
శంకర్ బ్యాలన్స్ భారతీయుడు షూట్ ని కంప్లీట్ చేస్తానని చెప్పడంతో లైకా వాళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న భారీ సినిమా అలాగే హిందీలో శంకర్ రీమేక్ చేయనున్న అపరిచితుడు రీమేక్స్ కి అడ్డు పడం అని హామీ ఇచ్చారట. సో శంకర్ కి ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమాలు కంప్లీట్ చేసుకుంటాడని చెప్పాలి.